garena free fire apk download

అన్ని రంగాల్లో ఏపీ విఫలం

అన్ని రంగాల్లో ఏపీ విఫలం

Published on February 12 2023
రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే సమయంలో విడిపోయినా ఏపీతో పోలిస్తే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని ఏపీ రాష్ట్ర బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ అన్నారు. అయితే ఏపీ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందని, కనీసం ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సామాన్య ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో చెప్పలేమన్నారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ నేటివిటీ ఎంప్లాయీస్‌ వర్కింగ్‌ ఇన్‌ సీమాంధ్ర (టీఎన్‌ఈడ బ్ల్యూఎ్‌సఏ), నాన్‌ లోకల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఎల్‌టీఏ) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ, తెలంగాణ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై ఉమ్మడి సదస్సు నిర్వహించారు. టీఎన్‌ఈడబ్ల్యూఎ్‌సఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తోట చంద్రశేఖర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొత్త పరిశ్రమలు రావడంతో తెలంగాణలో నిరుద్యోగ సమస్య లేదన్నారు. ఏపీలో కొత్త పరిశ్రమలేవీ రాకపోవడంతో నిరుద్యోగ సమస్యలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. తెలంగాణ మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తిచేసి కోటి ఎకరాలకు నీరు అందిస్తోందని, ఏపీలో పోలవరం ప్రాజెక్టు నేటికీ పూర్తి కాలేదన్నారు. మంచి పాలనను అందించే పార్టీలనే ఎన్నుకోవాలన్నారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.