ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, టీడీపీలకు బీఆ
ర్ఎస్సే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజలను నమ్మించి వంచించడంలో టీడీపీ, వైసీపీ ఒకదాన్ని మించి ఒకటి పోటీపడుతున్నాయని విమర్శించారు. ఆదివారం ఆయన గుంటూరు ఆటోనగర్ సమీపంలో కొత్తగా ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం పూజలు నిర్వహించి అధ్యక్షమస్థానంలో ఆసీనులయ్యారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పటాకులు
కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ తానే కట్టానని చెప్పుకునే చంద్రబాబు.. అమరావతిని ఎందుకు నిర్మించలేక పోయారని ప్రశ్నించారు. చెట్టు పేరు
చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం జగన్ అని, ఆయన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. 31 మంది ఎంపీలు ఉన్న అమప్పటికీ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయకుండా మోదీకి వంగి వంగి దండాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని పేరుతో
మూడు ముక్కలాటలు ఆడుతున్న జగన్ ఆట
“లను బీఆర్ఎస్ సాగనివ్వదని చెప్పారు. ‘మోదీ అంటే జగన్ కేసుల భయం. చంద్రబాబు మోదీతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తు
న్నారు. కేసీఆర్ మాత్రమే మోదీని దీటుగా ఎదుర్కోగలరు. మోదీని నిలదీసే సత్తా.. దేశానికి నాయకత్వం వహించే సత్తా కేసీఆర్‌కే
‘ఉన్నది’ అని స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ పథకాలు రూపొందించారని, ఏపీలోనూ వాటిని
అమలు చేస్తామని చెప్పారు.రానున్న
కాలంలో బీఆర్ఎస్ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో బీఆర్ఎస్
పోటీ చేస్తుందని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపొందించడంలో కేసీఆర్, కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏపీకి సమర్థ నాయ
కత్వం లేకపోవడం వల్లనే అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ఒక్క నగరం కూడా అభివృద్ధి చెండడం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ లో చేరిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర
ని కార్యాలయం ప్రారంభం సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు,
ప్రైవేటు ఉద్యోగుల సంఘం నాయకులు తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ప్రైవేటు ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు ఆధ్వర్యంలో ఏపీ కమిటీ సభ్యులు విజయలక్ష్మి, మాగంటి సత్య, ప్రసాద్, సురేశ్,
రాకేశ్, మస్తాన్ వలీ, ఉమేశ్, బాలినేని ప్రభాకర్‌రెడ్డి తదితరులు బీఆర్ఎస్ లో భారత ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఏపీ రాష్ట్ర
కమిటీ పోస్టర్‌ను తోట చంద్రశేఖర్, గంధం రాములు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదినారాయణ, డాక్టర్ గంగాధర్‌రావు, తోట సత్యనారాయణ, రమేశ్‌నాయుడు, తోట చేరారు.
సుబ్బారావు, సోషల్ మీడియా ఇన్చార్జి మోహన్‌నాయక్, మల్లెల శ్రీనివాసరావు. వి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.