garena free fire apk download

అట్టహసంగా తోట చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్

Dr. Thota Chandrashekhar birthday - 22
Published on June 29 2023
భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ జన్మ దిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బీఆర్ఎస్ ఎపి క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చాయి. తొలుత చంద్రశేఖర్ 150 కిలోల భారీ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. మేళ తాళాలు, బాణాసంచా నడుమ జరిగిన జన్మదిన వేడుకలు పండుగ వాతావారణాన్ని తలపించాయి. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు ప్రజల నుండి విశేషస్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా టిడిపి, వైసిపి ప్రభుత్వాల అసమర్థ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టి ప్రత్యామ్యాయ రాజకీయ శక్తిగా ఆవిర్భ వించిందని పేర్కొన్నారు. తెలంగాణాలో జరుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ వర్గాల వారు బిఆర్ఎస్ లో చేరుతున్నారని పునరుద్ఘాటించారు. ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారం చేప ట్టిన నాటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడి రాష్ట్రం అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మోసపూరిత వాగ్దానాలను ప్రజలు విశ్వసించడం లేదని ఘాటుగా విమర్శిం చారు. తెలంగాణా మోడల్ అభివృద్ధి ఎపిలో విస్తరించాలంటే ఎపిలో కేసిఆర్ నాయ కత్వాన్ని బలపర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రానున్న కాలంలో బిఆర్ఎస్ పార్టి బలమైన రాజకీయ శక్తిగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుం దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ నేత దాసోజి శ్రావణ్,ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ తదితర ప్రముఖులున్నారు. బిఆర్ఎస్ లో చేరిన కొవ్వూరు నుండిటి నాగరాజు, నెల్లూరు నుండి సురేష్ చంద్రా రెడ్డి, నాగరాజు,షేక్ ముజీబ్, తిరుపతి నుండి ధనుంజయ రాజు, సైదాపురం నుండి మల్లిఖార్జున్, రాజంపేట నుండి పునీత్, కిషోర్రెడ్డి, శ్రీను, జాకీర్, త్రినాద్, కిరణ్, హేమంత్, అభినయ్, గుడివాడ నుండి సాయి తదితరులు చేరారు. .