తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా
నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకర
ణను అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి
మాత్రమే ఉన్నదని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్య
క్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో 3 రోజుల పర్యటనకు వెళ్లిన
| ఆయనకు
శనివారం వైజాగ్ ఎయిర్పోర్టులో
ఘనస్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర జిల్లా
లకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు,
అభిమానులతోపాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగ
సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలి
వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. అనం
తరం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా
ఎయిర్పోర్టు నుంచి ఉడా పార్క్ వరకు భారీ
ర్యాలీ నిర్వహించారు. ఆ దారి పొడవునా
జెండా రెపరెపలాడాయి. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ..
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకునేం
దుకు తెలుగు ప్రజలు చేసిన పోరాటం చరి
త్రలో నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఆ
కర్మాగార పరిరక్షణ ఉద్యమాన్ని కూడా అదే
స్థాయిలో నిలబెడతామని భరోసా ఇచ్చారు.
ఏపీ ఆస్తులను కేంద్రం యథేచ్ఛగా కొల్లగొడు
తుంటే వైసీపీ, టీడీపీ నోరు మెదపడం లేదని,
ఆ రెండు పార్టీలు పరస్పరం పోటీపడుతూ
మోదీ సర్కారుకు సాగిలపడుతున్నాయని
ఎద్దేవా చేశారు. కేంద్రం నిరంకుశ విధానాలను
ఎదిరించడంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. లక్షల కోట్ల ఆస్తులున్న విశాఖ స్టీల్
ప్లాయిను దక్కించుకొని నష్టాల నుంచి గట్టెక్కా
లని టాటా స్టీల్స్ సంస్థ చూస్తున్నదని, మరో
వైపు తప్పుడు లెక్కలతో అడ్డంగా దొరికిపో
యిన అదానీ గ్రూప్ కూడా దొడ్డిదారిన వైజాగ్
స్టీల్ ప్లాంట్ను లాక్కోవాలని చూస్తున్నదని
ధ్వజమెత్తారు. పక్కా సమాచారంతోనే ఈ
వ్యాఖ్యలు చేస్తున్నామని, నిర్దిష్ట ప్రణాళికతో ఈ
అరాచకానికి అడ్డుకట్ట వేస్తామని స్పష్టం
చేశారు. మరో 2 రోజులు విశాఖలో పర్యటిం
చనున్న తోట చంద్రశేఖర్.. స్టీల్ ప్లాంట్ ఉద్యో
గులు, కార్మికులతోపాటు వివిధ
సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు.
విశాఖ ఉక్కు ఉద్యమానికి
బీఆర్ఎస్ మద్దతు
విశాఖ ఉక్కు ఉద్యమానికి బీఆర్ఎస్
సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు తెలంగాణ
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి
వినోదక్కుమార్ ప్రకటించారు. విశాఖ ఉక్కు
ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్
మంత్రి రాజశేఖర్, కో-కన్వీనర్ నీరుకొండ
రామచందర్రావు, ప్రతినిధి మురళీకృష్ణరావు |
శనివారం హైదరాబాద్
లోని మంత్రుల
నివాస ప్రాంగణంలో వినోద్ కుమార్తో భేటీ
అయ్యారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సంద
ర్శించి కార్మికుల పోరాటానికి సంఘీభావం
తెలపాలని సీఎం కేసీఆర్ను ఆహ్వానించేం
దుకు వారు వినోదక్కుమార్ను కలిశారు. తమ
పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని,
సీఎం కేసీఆర్ స్వయంగా విశాఖ ఉక్కు ఫ్యాక్ట
దీని సందర్శించేలా చూడాలని కోరారు.
దాదాపు రూ.4 లక్షల కోట్ల విలువైన ఆస్తులు |
కలిగిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్వీర్యం
చేసేందుకు మోదీ సర్కారు
కుట్ర పన్నిందని
ధ్వజమెత్తారు. ఆ ఫ్యాక్టరీని కాపాడుకునేంద
దుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని తెలి
పారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లా
ద డుతూ.. విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి
తీసుకెళ్తానని తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్య
మానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని
భరోసా ఇచ్చారు.