garena free fire apk download

రాష్ట్రంలో 175 సీట్లకూ బీఆర్ఎస్ పోటీ

రాష్ట్రంలో 175 సీట్లకూ బీఆర్ఎస్ పోటీ

Published on February 22 2023
రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లకు బీఆర్ఎస్ పోటీ చేస్తుం దని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు. వైసీపీ, టీడీపీలకు ధీటుగా తృతీయ రాజకీయ ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ప్రధాన భూమిక పోషించనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షు డిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బుధవారం తొలిసారిగా చంద్రశేఖర్ రాష్ట్రానికి వచ్చారు. గన్నవరం, గుంటూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, గుంటూరు జిల్లా ఉండవల్లిలో మహామృత్యుంజయ విశ్వశాంతి మహాయాగం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తోందని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్లలో తెలంగాణకు రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే, ఏపీకి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. దేశంలో రైతాంగ సమస్యలు ఏ ఒక్క పార్టీ పట్టించుకోలేదని, రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రరాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ముఖ్యమైన రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ దృష్టి పెడుతుందన్నారు. నిరుద్యోగం, ధరల నియంత్రణ లేకపోవడం ప్రధానంగా ఉన్న సమస్యలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనలో వైసీపీ, టీడీపీ పార్టీలు విఫలమయ్యాయన్నారు.