దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ
రాజకీయ శక్తిగా బీఆర్ఎస్
Published on April 9 2023
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ఎంతో
మంది ప్రాణత్యాగాలు చేశారని, అందుకు ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్
ప్లాంట్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసే కుట్రల్ని భారత రాష్ట్ర
సమితి(బిఆర్ఎస్) అడ్డుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్ర
శేఖర్ అన్నారు. శనివారం విశాఖలోని విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ థియేటర్లో ఉత్తరాం
ధ్ర జిల్లాలకు చెందిన పలువురు తోట సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు.
అనంతరం జరిగిన సమావేశంలో తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆంధ్ర ప్రజల
ఆస్తుల్ని తన అనుయాయులకు కట్టబెట్టే విధంగా ప్రధాని మోడీ కుట్రలు
చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించకుండా
నష్టాలను సాకుగా చూపుతూ మోడీ స్టీల్ ప్లాంట్‌ను టాటా సం సకు అప్పనంగా
కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగువారి మనోభావాలను
కనీసం గౌరవించకుండా బీజేపీ ఆంధ్ర అభివృద్ధి నిరోధకంగా మారిందని ఆగ్రహం
వ్యక్తం చేశారు. మూడు లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్‌ను ముప్పై ఐదువేల కోట్లకు
దొడ్డిదారిన ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేలా కేంద్రం పావులు కదుపుతుందన్నారు. ఓ
వైపు ఉన్న స్టీల్ ప్లాంటు ప్రైవేట్‌పరం చేస్తూ కొత్తగా కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
సహకరిస్తామని కేంద్రం ప్రకటించడం ప్రజల్ని మోసగించడమేనన్నారు. బీజేపీని
ఎదురించే శక్తి లేక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోడీకి వంగి వంగి దండాలు
పెడుతున్నారన్నారు. బీజేపీతో అంటకాగేం దు కు జగన్, చంద్రబాబు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాం టన్ను రక్షించుకునేందుకు ఏపీ ప్ర
భుత్వం ఐదువేల కోట్లు ఆర్థిక సాయాన్ని రుణంగా అందించలేదా అని
ప్రశ్నించారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా బిఆర్ఎస్
నిలుస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ కీలక పాత్ర పోషించ నుందని
ఆయన పేర్కొన్నారు. తొలుత భారీ గజమాలతో, డాక్టర్ తోటను పార్టీ శ్రేణులు
సత్కరించిఅపూర్వంగా స్వాగతించారు. విశాఖ నగరమంతా బిఆర్ఎస్ జెండాలతో
గులాబిమయంగా మారింది. ఈ కార్యక్రమంలో భారాస నేతలు టి.రమేష్
నాయుడు,తలారి సురేష్, రమణ బాబు పెద్దెత్తున భారాస శ్రేణులు పాల్గొన్నారు.