ఏపీ భారాస ఆధ్వర్యంలో ఘనంగా
కేసీఆర్ జన్మదిన వేడుకలు
Published on February 17 2023
భారత రాష్ట్ర సమితి
జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర
రావు జన్మదిన వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ నేతలు
శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఏపీ బీఆర్
ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసీఆర్
పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లో కోలాహలంగా
జరిగింది. బర్త్ డే సంబరాల్లో భాగంగా భారీ కేక్ కటింగ్
చేశారు. అనంతరం హైదరాబాద్ నందగిరి హిల్స్
పార్క్ వద్ద గ్రీన్ రాలెంజ్లో భాగంగా మొక్కలు
నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితర
సాధ్యుడని తోట చంద్రశేఖర్ అని కొనియాడారు.
సామాజిక ప్రయోజనాన్ని అభివృద్ధిని మేళవించడం
వల్లనే తెలంగాణా అభివృద్ధి నమూనా దేశానికే ఆదర్శ
ప్రాయంగా మారిందని ఆయన అభిప్రాయ పడ్డారు.
తెలంగాణా అభివృద్ధి విధానాల్ని ఆంధ్రప్రదేశ్ లో
విస్తృతంగా ప్రచారం చేస్తామని ప్రజా మద్దతుని
కూడగడతామని తోట చంద్రశేఖర్ ధీమా వ్యక్తం
చేశారు. పెద్ద ఎత్తున తోట అభిమానులు, బీఆర్ఎస్
కార్యకర్తలు తరలి రావడంతో నందగిరి హిల్స్ నుంచి
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు.
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని దాదాపు
రెండు వందలమంది రక్త దానం చేయడం విశేషం…..
ర్యాలీగా వచ్చిన తోట చంద్రశేఖర్ బృందానికి బ్లడ్
బ్యాంక్ సమన్వయకర్త రవణం స్వామినాయుడు
సాదర స్వాగతం పలికారు. డాక్టర్ తోట చంద్రశేఖర్ తో
సహా పలువురు నాయకులు కార్యకర్తలు రక్త దానం
చేశారు. ఈసందర్భంగా దేశ్‌కీ నేత కేసీఆర్ అంటూ
నినాదాలతో హోరెత్తించారు. దేశంలో బీఆర్ఎస్.
సర్కార్ రావడం ఖాయమని.. ఏపీలోనూ బీఆర్ఎస్
జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తోట చంద్రశేఖర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
GRS
అందించిన సంకల్ప స్ఫూర్తి, లక్ష్య శుద్ధితో ఏపీలో
అడుగులు వేస్తామని ఆయన వెల్లడించారు. అతి
త్వరలోనే ఏపీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేప
ట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తోట
చంద్రశేఖర్ తో పాటు ఏపీ బీఆర్ఎస్ నేతలు టీజే
ప్రకాశ్, రమేష్ నాయుడు, గుజ్జు రమేష్, నవుడు
వెంకటర రమణ, తెలంగాణా ప్రైవేట్ ఎంప్లాయిస్
యూనియన్ అధ్యక్షుడు గంధం రాములు, తెలంగాణ
సాయి ఆండ్ యూత్ తదితరులు పాల్గొన్నారు.