బి ఆర్ ఎస్ ఎపి చీఫ్ డాక్టర్ తోట టీడీపీ, వైసిపి పార్టీలతో విసిగి వేసారిన ఆంధ్ర ప్రజానీకానికి బి ఆర్ ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మారిందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. అవినీతిలో ఈ రెండు పార్టీలు పోటీపడి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయని ఆరోపించారు. వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రంలో ఉపాధి లేక చదువుకున్న యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక రాజధాని పేరుతో టిడిపి, రాజధాని ఎదో చెప్పలేని రాష్ట్రంగా వైసిపి రాష్ట్ర ప్రజల్ని మోసగించాయని ఎద్దేవా చేశారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాల పాలనలో అన్ని రంగాలు పూర్తిగా నిర్వీర్య మయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థల్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాల పై వేధింపులకు గురి చేయడం బిజెపి, వైసిపి పార్టీలకే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా మోడల్ అభివృద్ధిని ఎపి ప్రజలు కాంక్షిస్తూ న్నారని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి బిఆర్ఎస్ తో నే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు.