garena free fire apk download

మూడు రాజధానుల పేరుతో సిఎం జగన్ దొబూచులాట

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్

Published on April 30 2023
దేశంలోనే రాజధానిలేని ఏకైక రాష్ట్రంగా ఏపీని నిలిపి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలతో సిఎం జగన్మోహన్ రెడ్డి దొబూచులాడుతున్నారని భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. శనివారం హైద్రాబాద్ లోని బిఆర్ఎస్ ఏపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తోట మాట్లాడుతూ జగన్ తన పాదయాత్రలో రాజధానిగా అమరావతికే తన మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజాధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. అరకొర వసతులు, నాసిరకం పనులతో ఏపీ సచివాలయం సుమారు 700 కోట్ల వ్యయంతో నిర్మితమైందన్నారు. దానికన్న వంద కోట్ల తక్కువ ఖర్చుతో తెలంగాణా అట్టహాసంగా ప్రారంభం అధునాతన సౌకర్యాలతో నేడు తెలంగాణ సిఎం కేసిఆర్ చేతుల మీదుగా సచివాలయం అంతర్జాతీయ ప్రామాణాలతో కానుందన్నారు. అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమైన తెలంగాణ సచివాలయానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారి గోల్డ్ రేటింగ్ అవార్డు కు ఎంపికైనట్లు తెలిపారు. ఏపీ లో అమరావతి రాజధాని రైతులపై జరుగుతున్నా అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ రైతులకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ నానాటికీ పడిపోతోందన్నారు. ప్రభుత్వం పై ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకు వైసీపీ పెద్దలు ప్రజల్లో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ తమ మనుగడ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తొలుత తిరుపతి కి చెందిన జి.రాజు, గుంటూరుకు చెందిన జి.కృష్ణా రెడ్డి ,పీరాపురానికి చెందిన డాక్టర్ కే. ఆనంద రాజు, పలు జిల్లాలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున తోట సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.