garena free fire apk download

జీవితచరిత్ర

జీవితచరిత్ర

పరిచయం:

“తోట చంద్రశేఖర్” ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్, రాజకీయ నాయకుడు. తన 21 ఏళ్ళ ఐఏఎస్‌ సర్వీసులో మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పనిచేసారు. 2023 జనవరి 2న భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించబడ్డారు.

జననం, విద్య : -

చంద్రశేఖర్ ఆంద్రద్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లో, ఏలూరు పట్టణంలో జన్మించారు. తండ్రి రామారావు. 1977లో యాదవ హైస్కూల్ నుండి ఎస్.ఎస్.సి. పూర్తిచేసారు. 1979లో హిందూ కళాశాల నుండి ఇంటర్మీడియట్, 1982లో ఎ.సి.కాలేజ్ నాగార్జున విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ. 1984లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎమ్మెస్సీ పూర్తిచేసారు. 2000లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందాడు.
Dr. Thota Chandrashekhar A.P State President

వృత్తి జీవితం : -

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన తోట చంద్రశేఖర్‌ 1997 మే నుండి 2000 మే వరకు థానే మున్సిపల్ కార్పొరేషన్ మునిసిపల్ కమీషనర్‌గా పనిచేసారు. ఆ మూడేళ్ళకాలంలో థానే నగరాన్ని ప్రణాళికాబద్ధమైన, పరిశుభ్రమైన మరియు అందమైన నగరంగా మార్చారు.20 వేలకు పైగా అనధికార నిర్మాణాలను, ఆక్రమణలను తొలగింపజేసారు. స్లమ్ పాకెట్స్, డంపింగ్ గ్రౌండ్స్‌గా మారిన థానే సిటీలోని దాదాపు 15 సరస్సులను శుభ్రం చేసి సంరక్షించారు. దాదాపు 20 భారీ ప్రాజెక్టులను అమలు చేసారు.2000 సంవత్సరంలో హడ్కో – భారత ప్రభుత్వం అందించిన “క్లీన్ సిటీ ఎ వార్డు”ను కూడా థానే నగరం సాధించింది. చంద్రశేఖర్ థానే నుండి బదిలీ చేయబడినప్పుడు అతని బదిలీకి నిరసనగా ప్రజలు మూడురోజుల బంద్ పాటించారు. ఆయన పనితనాన్ని అవార్డులకు మించి చాటిచెప్పే ఒక ఉదాహరణ ఇది. ఆ తరువాత 2002 అక్టోబరు నుండి 2005 జూన్ వరకు మెట్రోపాలిటన్ కమిషనర్ గా పనిచేసారు. ముంబై మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్, ముంబై అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ముంబై మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదలైన ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేసారు. 18 నెలల రికార్డు సమయంలో బాధిత ప్రజలకు పునరావాసం కల్పించడానికి 50,000 ఇళ్ళను కూడా నిర్మించారు. 2000 – 2002 వరకు నాగ్‌పూర్ మునిసిపల్ కమీషనర్‌గా పనిచేసారు. 2002లో నాగ్‌పూర్ నగరానికి రెండవసారి క్లీన్ సిటీ అవార్డును అందుకున్నాడు. రెండు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో నాగపూర్ ను మహారాష్ట్ర రెండవ రాజధానిగా రూపానిచ్చాడు. 2008లో ఉద్యోగానికి రాజీనామా చేసారు. అనంతరం ఆదిత్య హైజింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేసారు.

ప్రజా జీవితం:

“తోట చంద్రశేఖర్” ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్, రాజకీయ నాయకులు. మహారాష్ట్రలో 21 ఏళ్ళ సుదీర్ఘ కాలం ఐఏఎస్‌ సర్వీస్ లను అక్కడి ప్రజలకు అందించి, ముంబై, నాగపూర్ నగరాలలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అక్కడ తనదంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని తన పాలన ముద్రను అక్కడ వేసారు. మహారాష్ట్ర లో చేసిన సేవలకు ఎన్నో అవార్డులు, రివార్డులు, రికార్డులు అందుకున్న ఆయన.. తన రాష్ట్రం కోసం కూడా ఏదైనా చెయ్యాలనుకున్నారు. అందుకోసం ప్రజలకు మరింత చేరువ కావాలనుకున్నారు. రాష్ట్ర పరిస్థితులలో, ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే.. అది కొత్త సిద్దంతాలు, కలుషితమవ్వని రాజకీయ ఉద్దేశ్యాలు, ప్రజలలోంచి వచ్చే నాయకులతోనే సాధ్యం అని ఆయన భావించారు. ఆయన ఆలోచనలకు తగ్గట్టే అప్పుడే తెలుగు సినీ హీరో ‘చిరంజీవి’ గారు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్న నేపధ్యం లో.. ‘ప్రజా రాజ్యం’ పార్టీ వ్యవస్థాపనలో ఆయన కీలక భూమిక పోషించారు. చిరంజీవి గారు ప్రజా రాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసాక కూడా ఆయన తన స్పూర్తిని వదులుకుని వెను తిరగకుండా ఆ తరువాత ysr కాంగ్రెస్ పార్టీ లోనూ తన ప్రయాణాన్ని కొనసాగించారు.. కానీ, అది ఆయన ఆలోచనలకు అనుకున్న విధానానికి సరైనది కాదని గ్రహించాక, జనసేన బలోపేతంలో తనదైన ముద్ర వేసారు. కానీ, రాష్ట్రంలో మార్పు తీసుకురావాలంటే అది సదుద్దేశాలు కలిగిన ఒక అనుభవజ్ఞుడైన నాయకుడి వల్లే అవుతుందని ఆయన గ్రహించారు. ఇదే సమయం లో కెసిఆర్ గారు భారాస(భారతీయ రాష్ట్ర సమితి) పార్టీ స్థాపించి దేశం లో మార్పు తేవాలని దీక్ష పూనిన సమయం లో.. ఆయన విధి విధానాలు నచ్చి, ఆయన తెలంగాణ కు చేసిన అభివృద్ధి నచ్చి, ఆయన విజన్ నచ్చి.. ఇలాంటి నాయకత్వమే ఆంధ్రప్రదేశ్ కు అవసరం అని ఆయన భావించారు. అటు కెసిఆర్ గారు కూడా తన పార్టీ ని ఆంధ్ర ప్రదేశ్ లో ముందుకు తీసుకెళ్ళ గల, తన విజన్ కు సరితూగే అడ్మినిస్ట్రేటర్ కోసం వెతుకుతూ.. తోట చంద్ర శేఖర్ గారిని భారతీయ రాష్ట్ర సమితి (BRS)కు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించబడ్డారు.

అవార్డ్స్ మరియు హానోర్స్:

  • భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నుంచి ప్రైమ్ మినిస్టర్ అవార్డు అందుకున్నారు.
  • జెయింట్స్ ఇంటర్నేషనల్ అవార్డును కేంద్రమంత్రి శరత్ పవార్ గారి చేతుల మీదుగా అందుకున్నారు.
  • మాజీ రాజ్యసభ స్పీకర్ శ్రీమతి నజ్మా హెప్తుల్లా గారి నుంచి AIMA పురస్కారాన్ని అందుకున్నారు.
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విలాస్ రావ్  దేశముఖ్ గారి నుంచి రాజీవ్ గాంధీ అడ్మినిస్ట్రేటీవ్ రిఫార్మ్స్ అవార్డును అందుకున్నారు.
  • కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ జగ్మోహన్ గారి హస్తాల మీదుగా క్లీన్ సిటీ పురస్కారం అందుకున్నారు.

విజన్ & మిషన్ :

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తేవాలి, అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చెయ్యాలి, అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుని ప్రగతి పధం లో నడిపించాలి, ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామి గా నిలబెట్టాలి.