దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ
రాజకీయ శక్తిగా బీఆర్ఎస్
Published on April 17 2023
తెలుగు రాష్ట్రాల్లో
అత్యధిక శాతం జనాభా ఉన్న కాపులు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైయ్యారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాద్ లోని భారాస ఏపి
కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో
చంద్రశేఖర్ మాట్లాడుతూ వివిధ రాజకీయపార్టీలు తెలగ,బలిజ,కాపు,ఒంటరిలనున్ తమ స్వార్ధ రాజకీయ ప్రయోజ
నాల కోసం వాడుకొని వదిలేస్తూ వారి సంక్షేమాన్ని విస్మ
రించాయని ఆవేదన వ్యక్తం చేసారు. టిడిపి, వైసిపి పార్టీలకు కాపులు కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తారని ఎద్దేవా
చేసారు. ఓటుబ్యాంక్ రాజాకీయాలకు పాల్పడే వారికి చెల్లు చీటీ పలకాలని కాపులకు పిలుపునిచ్చారు. కాపుల సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పురోభి వృద్ధి సాధించేందుకు
భారాస కృషి చేస్తోందని స్పష్టం చేసారు. రానున్న ఎన్నికల్లో ఏపి లో రాసా అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోందని చెప్పారు. తొలుత కాపు సంఘాల సంక్షేమ సమితి అధ్యక్షులు
మిరియాల చిన్న రాఘవులు తోట చంద్రశేఖర్‌ను కలసి రంగా
రెడ్డి జిల్లా సేర్లింగంపల్లి లో కాపు సంక్షేమ భవన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపు నుండి ఐదు ఎకరాల స్థలం మంజూరయ్యేలా సహకరించాలని వినతి పత్రం అందజేశారు.
అనంతరం, మచిలీపట్టణం కు చెందిన మిరియాల చిన్న
రాఘవులు గుంటూరు కు చెందిన మెహబూబ్ బాష, నూర్
ఖాన్, అయ్యప్ప రెడ్డి, ఒంగోలు నుండి జాని,శ్రీకాకుళం
నుండి చంద్రశేఖర్, పలు జిల్లాలకు చెందిన నేతలు డాక్టర్ తోట చంద్రశేఖర్ సమక్షంలో భారాస పార్టీలో చేరారు.