“తోట చంద్రశేఖర్” ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్, రాజకీయ నాయకులు. మహారాష్ట్రలో 21 ఏళ్ళ సుదీర్ఘ కాలం ఐఏఎస్ సర్వీస్ లను అక్కడి ప్రజలకు అందించి, ముంబై, నాగపూర్ నగరాలలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అక్కడ తనదంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని తన పాలన ముద్రను అక్కడ వేసారు. మహారాష్ట్ర లో చేసిన సేవలకు ఎన్నో అవార్డులు, రివార్డులు, రికార్డులు అందుకున్న ఆయన.. తన రాష్ట్రం కోసం కూడా ఏదైనా చెయ్యాలనుకున్నారు. అందుకోసం ప్రజలకు మరింత చేరువ కావాలనుకున్నారు. రాష్ట్ర పరిస్థితులలో, ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే.. అది కొత్త సిద్దంతాలు, కలుషితమవ్వని రాజకీయ ఉద్దేశ్యాలు, ప్రజలలోంచి వచ్చే నాయకులతోనే సాధ్యం అని ఆయన భావించారు. ఆయన ఆలోచనలకు తగ్గట్టే అప్పుడే తెలుగు సినీ హీరో ‘చిరంజీవి’ గారు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్న నేపధ్యం లో.. ‘ప్రజా రాజ్యం’ పార్టీ వ్యవస్థాపనలో ఆయన కీలక భూమిక పోషించారు. చిరంజీవి గారు ప్రజా రాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసాక కూడా ఆయన తన స్పూర్తిని వదులుకుని వెను తిరగకుండా ఆ తరువాత ysr కాంగ్రెస్ పార్టీ లోనూ తన ప్రయాణాన్ని కొనసాగించారు.. కానీ, అది ఆయన ఆలోచనలకు అనుకున్న విధానానికి సరైనది కాదని గ్రహించాక, జనసేన బలోపేతంలో తనదైన ముద్ర వేసారు.
కానీ, రాష్ట్రంలో మార్పు తీసుకురావాలంటే అది సదుద్దేశాలు కలిగిన ఒక అనుభవజ్ఞుడైన నాయకుడి వల్లే అవుతుందని ఆయన గ్రహించారు. ఇదే సమయం లో కెసిఆర్ గారు భారాస(భారతీయ రాష్ట్ర సమితి) పార్టీ స్థాపించి దేశం లో మార్పు తేవాలని దీక్ష పూనిన సమయం లో.. ఆయన విధి విధానాలు నచ్చి, ఆయన తెలంగాణ కు చేసిన అభివృద్ధి నచ్చి, ఆయన విజన్ నచ్చి.. ఇలాంటి నాయకత్వమే ఆంధ్రప్రదేశ్ కు అవసరం అని ఆయన భావించారు. అటు కెసిఆర్ గారు కూడా తన పార్టీ ని ఆంధ్ర ప్రదేశ్ లో ముందుకు తీసుకెళ్ళ గల, తన విజన్ కు సరితూగే అడ్మినిస్ట్రేటర్ కోసం వెతుకుతూ.. తోట చంద్ర శేఖర్ గారిని భారతీయ రాష్ట్ర సమితి (BRS)కు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించబడ్డారు.